భారతదేశం, జూలై 4 -- ఇటీవలి కాలంలో పర్సనల్​ లోన్​ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అవసరం ఏదైనా, పర్సనల్​ లోన్​వైపు మొగ్గుచూపుతున్నారు. బ్యాంకులు సైతం త్వరితగతిన లోన్​లు మంజూరు చేస్తున్నాయి. అయితే, సాధారణంగా పర్సనల్​ లోన్​ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లను మాత్రమే చూస్తుంటాము. కానీ వ్యక్తిగత రుణం విషయంలో వడ్డీ రేట్లతో పాటు మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాల్లో ప్రాసెసింగ్ ఛార్జీలు, బ్యాంకు లేదా రుణదాతల విశ్వసనీయత, హిడెన్​ ఛార్జీలు వంటివి ఉంటాయి. వాటి వివరాలు..

I. ప్రాసెసింగ్ ఛార్జీలు: మీరు పర్సనల్​ లోన్​ కోసం దరఖాస్తు చేసినప్పుడు, రుణదాత రుణ మొత్తంలో కొంత భాగాన్ని ప్రాసెసింగ్ ఛార్జీలుగా వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో, ఈ ప్రాసెసింగ్ ఛార్జీలు 5 శాతం వరకు ఉండవచ్చు! కాబట్టి, ఒక బ్యాంక్ తక్కువ వడ్డీని వసూలు చేసినా, ప్...