భారతదేశం, ఆగస్టు 7 -- ఇంటిని ఎంత అందంగా కట్టుకున్నప్పటికీ, వాస్తు నియమాలను పాటించకపోతే కుటుంబసభ్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గృహంలో అత్యంత కీలకమైన స్థానం వంటిల్లు (Kitchen). ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే అగ్ని మూలంలో కిచెన్ ఉండటమే కాకుండా, దాని నిర్మాణంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

లేదంటే ఎంతటి సంపన్నులైనా ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంటింటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు, జ్యోతిష్య పరిహారాలు ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా వంటగదిని ఆగ్నేయ మూలలో నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కిచెన్ సరైన దిశలో ఉన్నప్పటికీ, దాని ఫ్లోరింగ్ లేదా నేల నిర్మాణంలో లోపాలు ఉంటే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.

ఇంటిలోని ఇతర భాగాలతో పోలిస్తే వంటింటి నేల అగ్నేయ మూల...