భారతదేశం, సెప్టెంబర్ 23 -- నారా రోహిత్ నటించిన రొమాంటిక్ కామెడీ సుందరకాండ ఓటీటీలోకి వచ్చేసింది. దాని డిజిటల్ ప్రీమియర్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఎండ్ కార్డు పడింది. సినీ ప్రేమికులు ఈ రోజు నుంచే ఈ మూవీని ఇంటి నుంచి ఓటీటీలో చూడొచ్చు. ఈ చిత్రం ఆగస్టు 27న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్పందనను పొందింది. అయితే అది తన ఊపును కొనసాగించలేకపోయింది. నారా రోహిత్ నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఓటీటీ డెబ్యూ వివరాలు మీకోసం.

నారా రోహిత్ హీరోగా లీడ్ రోల్ ప్లే చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ సుందరకాండ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ఇవాళ (సెప్టెంబర్ 23) డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సుందరకాండ ఓటీటీ డెబ్యూ చేసింది....