భారతదేశం, డిసెంబర్ 15 -- ప్రస్తుతం రణబీర్ కపూర్‌తో 'రామాయణం' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవి.. త్వరలో మరో భారీ ప్రాజెక్టులో నటించే అవకాశం ఉంది. లెజెండరీ సింగర్ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించేందుకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పుడీ వార్త ఎంతో ఆసక్తి రేపుతోంది.

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గత కొన్ని నెలలుగా కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ మూవీ 'రామాయణం' (Ramayana) షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

'జెర్సీ' ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. దిగ్గజ గాయని, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ బయోపిక్‌లో ప్రధాన పాత్ర కోస...