భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! వేరే పురుషుడితో అఫైర్​ ఉందేమో అన్న అనుమానంతో, ఓ వ్యక్తి తన లివ్​-ఇన్​ పార్ట్​నర్​ని చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బ్యాగులో కుక్కి, సెల్ఫీ తీసుకున్నాడు!

యూపీ కాన్పూర్​లో జరిగింది ఈ ఘటన. నిందితుడు సూరజ్​ కుమార్​ ఉత్తమ్​ ఒక ఎలక్ట్రీషియన్​. ఆకాంక్ష అనే 20ఏళ్ల మహిళతో అతనికి ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆమె ఓ రెస్టారెంట్​లో పనిచేసేది. ఆమెను కలిసేందుకు అతను రెస్టారెంట్​కి వెళ్లేవాడు.

కాన్పూర్​లోని బర్రా అనే ప్రాంతంలో ఆకాంక్ష తన సోదరితో కలిసి ఉండేది. కానీ ప్రేమికులు కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి హనుమంత్​ విహార్​ అనే ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

కొన్ని రోజులు అంతా సాఫీగా...