భారతదేశం, సెప్టెంబర్ 11 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మానవ జీవితాలపై, ఆర్థిక పరిస్థితులపై ఈ గ్రహాల గమనం తీవ్ర ప్రభావం చూపుతుంది. వచ్చే సెప్టెంబర్ 26న సంపద, ఐశ్వర్యాలకుకారకులైన బుధ, శుక్రులు ఒకే రాశిలో కలవబోతున్నారు. ఆ రోజున బుధ భగవానుడు తులా రాశిలోకి ప్రవేశిస్తారు. ఇప్పటికే ఆ రాశిలో శుక్రుడు సంచరిస్తున్నారు. ఈ ఇద్దరు శుభ గ్రహాల కలయిక వల్ల అత్యంత శుభప్రదమైన 'లక్ష్మీ నారాయణ రాజయోగం' ఏర్పడనుంది.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం కేంద్ర, కోణాధిపతులు కలవడం వల్ల ఈ యోగం సిద్ధిస్తుంది. శుక్రుడు మహాలక్ష్మికి, బుధుడు విష్ణుమూర్తికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ ఇద్దరి సంయోగం వల్ల మానవులకు ధన ధాన్యాలు, సంతోషం, వ్యాపారంలో అఖండ విజయం లభిస్తాయి. ఈ రాజయోగం ప్రభావం వల్ల ఏయే రాశుల వారి జాతకం మారనుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

లక్ష్మీ నా...