భారతదేశం, డిసెంబర్ 12 -- భారతీయ సినిమా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ తన యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇవాళ రజినీకాంత్ 75వ పుట్టిన రోజు. డిసెంబర్ 12న రజినీ అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా ఐఎండీబీ ప్రకారం రజినీకాంత్ టాప్-5 సినిమాలు, వాటి ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.

రోబో 2.0 మూవీ 2018లో రిలీజైంది. ఇది రోబోకు సీక్వెల్ గా వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. చిట్టి రోబో పాత్రలో రజినీకాంత్ తన నటనను మరోసారి ప్రదర్శించారు. 2.0 ముఖ్యంగా హిందీ, చైనీస్ మార్కెట్లలో అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.675 కోట్ల గ్రాస్ సాధించింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉంది.

2023లో వచ్చిన జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిల...