భారతదేశం, మే 21 -- Rohini karthi 2026: ఈ ఏడాది రోహిణి కార్తె మే 25 నుంచి ప్రారంభమవుతుంది. అంటే అప్పటి నుంచి తీవ్రమైన ఎండలు మొదలవుతాయి. రోహిణి కార్తె అంటే ఏంటి? ఈ సమయంలో ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? అలాగే సూర్యుని అనుగ్రహం కలగాలని, జాతకంలో సూర్యుడు బలపడాలన్నా కొన్ని దానాలు చేయడం వంటివి పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిణి కార్తె మే 25న ప్రారంభమవుతుంది. రోహిణి కార్తె అంటే సూర్యుడు ప్రతి 13 రోజులకు ఒకసారి తన నక్షత్రంలో మార్పు చేస్తూ ఉంటాడు. రోహిణి కార్తె సమయంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది. ఆ తర్వాత మృగశిర కార్తె, ఆరుద్ర కార్తె మొదలవుతాయి.

సూర్యుడు ఈ సమయంలో మన నెత్తి మీదకు వస్తాడు. ఈ కార్తె...