భారతదేశం, జూన్ 8 -- ప్రతి ఒక్కరూ మరొకరితో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటారు. ఒక్కో రాశి వారు కొన్నిట్లో దృఢంగా ఉంటే, అదే మరి కొన్ని రాశుల వారికి బలహీనత అవ్వచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని, కోరుకున్న వ్యక్తి వారి జీవితంలోకి రావాలని అనుకుంటారు. మన జీవితంలో ప్రేమ, అనురాగం చాలా ముఖ్యమైన అనుభూతులు. అయితే భాగస్వామిని ఎక్కువగా ప్రేమించడం, వారిని సంతోషంగా ఉంచడం అందరికీ కుదరదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఒక మనిషి ప్రేమ తత్వం, వారి రొమాంటిక్ ప్రవర్తన అనేది రాశిపై కూడా ఆధారపడి ఉంటుంది. శృంగారానికి, అందానికి, ఆకర్షణకు అధిపతి శుక్రుడు. శుక్రుడి ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారు సహజంగానే ఎక్కువ రొమాంటిక్‌గా ఉంటారు. అలాగే వారి భాగస్వామి కోసం ఏదైనా త్యాగం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరి ఆ రాశుల వారు ఎవరు? ఈ రాశుల్లో మీ...