భారతదేశం, డిసెంబర్ 21 -- ప్రయాణికుల ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్, వెయిటింగ్ లిస్టు కష్టాలను అధిగమించేలా కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం.. ఇకపై రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్‌ చార్ట్ సిద్ధం కానుంది. ఈ నిర్ణయాన్ని తక్షణమే అన్ని జోన్లలో అమలు చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ లో అమలు చేయటంపై అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటి వరకు ట్రైన్ బయలుదేరడానికి 4గంటల ముందు మాత్రమే రిజర్వేషన్‌ చార్జును సిద్ధం చేసేవారు. దీంతో ప్రత్యేకించి వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల్లో చివరి క్షణాల వరకు ఉత్కంఠ కొనసాగేది. టికెట్ బుకింగ్ అవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ ఉండకపోయేది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు పది గంటలు ముందుగా చార్ట్ సిద్ధం చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ...