భారతదేశం, సెప్టెంబర్ 16 -- రైళ్లల్లో ధూమపానం, మద్యపానం నిషేధం అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఒక మహిళ మాత్రం రైలు ఏసీ కోచ్​లో సిగరెట్​ కాల్చుతూ దొరికిపోయింది. "ఎందుకు సిగరెట్​ కాల్చుతున్నావు?" అని అడిగిన వారిపై ఆమె కోపం తెచ్చుకుంది. "పోలీసులను పిలుచుకో" అంటూ తన సీటులో కూర్చుండిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియో ప్రకారం.. కెమెరా పట్టుకున్న ఒక వ్యక్తి.. సదరు మహిళను సిగరెట్​ విషయంపై ప్రశ్నలు వేశాడు. "ఏసీ కోచ్​లో ఎందుకు సిగరెట్​ కాల్చుతున్నావు" అని అడిగాడు. వీడియో రికార్డు చేయడం ఆపమని, తాను బయటకి వెళతానని ఆమె చెప్పింది. కానీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఫలితంగా కంపార్ట్​మెంట్​ని విడిచిపెట్టేందుకు మహిళ నిరాకరించింది.

ఈ నేపథ్యంలోనే పోలీసులను పిలుస్తామని పక్కన ఉన్న ఇతర ప్రయాణికుల...