భారతదేశం, ఏప్రిల్ 20 -- కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజాపాలనలో రైతు ఉత్సవాల పేరుతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సభా వేదిక నుంచే రెండో విడత రైతు భరోసా నిధులను (రూ. 5,700 కోట్లు) విడుదల చేశారు.

రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలోపే చేసి చూపించామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ.22 వేల కోట్లు వేశామని గుర్తుచేశారు. గత విడతలో రైతుభరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు వేశామన్న సీఎం.. తాజాగా రెండో విడతగా రూ.5,700 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు.

క...