భారతదేశం, మార్చి 16 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.

అసెంబ్లీ మీడియా హాల్‌లో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హరీశ్ రావ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మొద్దు నిద్రను వదిలించేందుకే బీఆర్ఎస్ పక్షాన పదేపదే నిలదీస్తున్నామని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నిరంతరం శ్రమించారని వివరించారు.

గోదావరి నదిలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ఉన్న హక్కులను కేసీఆర్ శాశ్వతంగా కాపాడారని హరీశ్ రావ్ గుర్తు చేశారు. ...