భారతదేశం, అక్టోబర్ 31 -- బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురువారం (అక్టోబర్ 30) రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై వెళ్లిన రేవంత్ తో సల్మాన్ కాసేపు ప్రత్యేకంగా మాట్లాడాడు. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని తాను ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తానని సల్మాన్ హామీ ఇచ్చాడు.

సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ ఇప్పుడు ఎంతో ఆసక్తి రేపుతోంది. ముంబై వెళ్లిన రేవంత్ రెడ్డిని సల్మాన్ ప్రత్యేకంగా కలిసి తెలంగాణ గురించి చర్చించడం విశేషం. తెలంగాణ కాంగ్రెస్ తోపాటు ఈ ఫొటోలను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరూ తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ 2047 నినాదానికి సల్మాన్ మద్దతిచ్చాడు.

2034 వరకు తెలంగాణను ట్రిల...