Hyderabad, ఆగస్టు 8 -- రక్షాబంధన్ సోదరుడు, సోదరి మధ్య బంధాన్ని తెలుపుతుంది. రక్షాబంధన్ నాడు సోదరీ, సోదరుడికి రాఖీ కడతారు. అయితే రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడికి ఏ రంగు రాఖీ కడితే మంచిదో, రాశుల ఆధారంగా తెలుసుకుందాం.

మేష రాశి సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఎరుపు రంగు దుస్తులను ధరించి, ఎరుపు రంగు రాఖీని కడితే మంచిదే. ఇది ఇద్దరిమధ్య ప్రేమ, అనురాగాలను బలపరుస్తుంది. సంతోషంగా ఉంచుతుంది.

తెలుపు లేదా నీలం రంగు ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. రక్షాబంధన్ నాడు ఈ రంగుల దుస్తులను వేసుకుని, అదే రంగు రాఖీని కట్టండి. దీంతో అదృష్టం పెరుగుతుంది.

మిథున రాశి వారికి ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ రంగు రాఖీని, ఈ రంగు దుస్తులను ధరించి కడితే మంచిది. ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. సంతోషంగా ఉంటారు.

ఈ రాశి వారికి తెల్లని తెలుపు రంగు అదృష్టం...