Hyderabad, జూలై 28 -- నాగ పంచమిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రకృతిని ఆరాధించడం అనేది మన సంప్రదాయం. పురాణ కాలం నుంచి భారతీయులు దీనిని అనుసరిస్తున్నారు. ప్రతి ఏడా శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని నాగపంచమి అని జరుపుతారు. దీనిని నాగుల పంచమి అని కూడా అంటారు. ఈ నాగపంచమి విశిష్టతను పరమశివుడు స్వయంగా వివరించడం జరిగింది.

నాగ పంచమి నాడు పలు పరిహారాలను పాటించినా, పూజలు చేసినా శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు నాగపంచమి విశిష్టత ఏంటి? అసలు ఎందుకు ఈ పండుగను జరుపుకోవాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.

ఆదిశేషులు సేవకు సంతోషపడి, విష్ణువు "ఒక వరం కోరుకో"మని అడుగుతాడు. అప్పుడు శేషుడు, తాను ఉద్భవించిన పంచమి నాడు సృష్టిలో మానవులందరూ సర్ప పూజలు చేయాలని ప్రార్థించగా, ఆయన కోరిక మేరకు శ్రీహరి, శ్రావణ శుద్ధ పంచమి నాడు సర్ప పూజలు చేస్తారని అనుగ్రహం ఇచ్చార...