భారతదేశం, డిసెంబర్ 26 -- ది రాజా సాబ్ సందడి రిలీజ్ కు రెండు వారాల ముందే మొదలు కానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ ను మాత్రం ఈ శనివారమే (డిసెంబర్ 27) నిర్వహిస్తుండటం విశేషం. అలాగే మూవీ నుంచి మాళవిక మోహనన్ పాత్ర భైరవి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆశ్చర్యకరంగా రెండు వారాల ముందే నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది.

వేదిక వివరాలను తర్వాత అనౌన్స్ చేస్తామని మేకర్స్ చెప్పారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం.. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి అనే క్యాప్షన్ తో మేకర్స్ ఓ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చూసి ఫ్యాన్స్ పండగ చేసు...