Hyderabad, సెప్టెంబర్ 13 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 14న గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. చంద్రుడు, గురువు సంయోగం చెందడంతో ఈ గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.

ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా ప్రవేశించినప్పుడు మరో గ్రహంతో సంయోగం చెందుతాడు. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి.

జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే, సెప్టెంబర్ 14 అంటే రేపు చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో గురువు కూడా మిధున రాశిలో ఉండడంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. గజకేసరి రాజయోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది.

ఇది అనేక శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. ఈ యోగం ప్రభావం 12 రాశుల వారిపై ఉంటుంది, కానీ...