భారతదేశం, జూన్ 12 -- చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. మన సమస్యలకు కారణం గ్రహాల కదలికలు కూడా అవ్వచ్చు. అయితే చాలామంది శని బాధలతో సతమతమవుతుంటారు. శని కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

రేపు, అనగా జూన్ 13న మాస శివరాత్రి, శని త్రయోదశి, కృత్తికా నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం అని చెప్పొచ్చు. శని బాధల నుంచి బయటపడడానికి ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. రేపు మాస శివరాత్రి, శని త్రయోదశి, కృత్తికా నక్షత్రం కనుక ఈ మహోత్తరమైన రోజున శివాభిషేకం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్షు పెరుగుతుంది, సంపద కూడా కలుగుతుంది.

కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారు ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడు రాశుల్లో మీ రాశి కూడా ఉన్నట్లయితే ఈ రోజున దశరథ ప్రోక్త, శని స్తోత్రం చదువుకోవడం మంచిది....