భారతదేశం, జూలై 9 -- గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో గ్రహాల సంచారం వల్ల శుభఫలితాలు ఎదురైతే, మరికొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చంద్రుడు కూడా కాలానుగుణంగా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. చంద్ర సంచారంలో మార్పు వచ్చినప్పుడు కూడా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. చంద్రుడు చాలా తక్కువ సమయంలోనే ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పటికీ, ఆ ప్రభావంతో శుభఫలితాలు లేదా అశుభ ఫలితాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జూలై 10, శుక్రవారం సాయంత్రం 6:44 గంటలకు చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజు యోగినీ ఏకాదశి కూడా. జూలై 12 వరకు, అంటే రెండు రోజుల పాటు చంద్రుడు ఇదే రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. దీ...