Hyderabad, సెప్టెంబర్ 20 -- హిందూమతంలో అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఇంతా అంతా కాదు. అందులోనూ పితృపక్షంలో వచ్చే అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ ఏడాది సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య తిధి నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.

ఆదివారం, అమావాస్య రావడం చాలా శక్తివంతమైనది. సూర్యుడికి అమావాస్య, చంద్రుడికి సంబంధించిన ఈ ఆదివారం పితృదేవతలకు చాలా విశేషమైనది. పితృదేవతలకు ఆత్మవిశ్వాసానికి, గౌరవానికి సూర్యుడు చిహ్నం. భావోద్వేగాలు, మనసు, పూర్వికులకు సంబంధించినది చంద్రుడు. అయితే ఈ రెండు గ్రహాలు ఒకచోట కలవడం పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమమైన రోజు అని చెప్పొచ్చు.

ఈరోజు పితృదేవతలు తలచుకుని దానం చేయడం వలన మంచి జరుగుతుంది. అదే విధంగా ప్రత్యేక పూజలు, తర్పణాలు వదిలిపెట్టడం లాంటివి చేస్తే కూడా దోషాల నుంచి బయటపడవచ్చు...