భారతదేశం, ఆగస్టు 23 -- క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ హిందీ మరో కొత్త సీజన్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. ఈ హిందీ రియాలిటీ షో రేపటి నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 24 నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోను ఆడియన్స్ చూడొచ్చు. అయితే ఈ సారి డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ అండర్ టేకర్, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనే టాక్ వైరల్ గా మారింది.

బిగ్ బాస్ రియాలిటీ షోకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే హిందీ బిగ్ బాస్ అట్రాక్షన్ ను మరింత పెంచేందుకు, గ్లోబల్ ఆడియన్స్ కు చేరువ చేసేందుకు మేకర్స్ స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకే అండర్ టేకర్, మైక్ టైసన్ ను హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా పంపిస్తారని సమాచారం. వీళ్లు హౌజ్ లో ఒకటి లేదా రెండు వారాలు ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఈ...