భారతదేశం, జనవరి 21 -- ఆస్కార్ గెలుచుకున్న 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాలోని "జయహో" (Jai Ho) పాట చుట్టూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ పాటను స్వరపరిచింది ఏఆర్ రెహమాన్ కాదని, సింగర్ సుఖ్వీందర్ సింగ్ అని రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్జీవీ బుధవారం (జనవరి 21) నాడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టాడు.

ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చేసిన కామెంట్స్ విషయంలో అతనిపై దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో జయహో పాట గురించి చేసిన కామెంట్స్ ను కొందరు తెరపైకి తెచ్చారు. తాజాగా అతడు దీనిపై వివరణ ఇచ్చాడు.

"జయహో పాట విషయంలో నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. సందర్భం లేని విషయాలను వక్రీకరించి రాస్తున్నారు" అని వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. రెహమాన్‌తో తనకు ఉ...