భారతదేశం, అక్టోబర్ 2 -- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం శుక్రవారం తెల్లవారుజామున గోలాప్‌పూర్-పారాదీప్ మధ్య తీరే దాటే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో నాలుగురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.

రాబోయే కొద్ది రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలు, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే...