Hyderabad, జూన్ 28 -- టాలీవుడ్ హీరోయిన్‌గా సంచలనం సృష్టించిన బ్యూటిఫుల్ భామ ఇలియానా డి క్రూజ్. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా పోకిరి మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అగ్ర హీరోలతో జత కట్టి సెన్సేషనల్ బ్యూటిగా పేరు తెచ్చుకుంది.

అయితే, తాజాగా ఇలియానా డి క్రూజ్ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫొటో షేర్ చేసి మరి చెప్పింది. రెండోసారి కూడా కుమారుడికి జన్మనిచ్చిన ఇలియానా సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.

శనివారం అంటే ఇవాళ (జూన్ 28) ఇలియానా తన రెండో కుమారుడి ఫొటోను షేర్ చేసి పుట్టిన తేదిని కూడా రాసుకొచ్చింది. అలాగే, బాబు పేరు కూడా ఏంటో చెప్పేసింది ఇలియానా. 2025 జూన్ 19న తనకు రెండో కుమారుడు పుట్టినట్లు ఫొటోలో తెలిపింది ఇలియానా. అలా...