భారతదేశం, నవంబర్ 3 -- ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని తన నెక్ట్స్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో నటించడమే కాదు రామ్ ఓ పాట రాసి, పాడటం విశేషం. అంతేకాదు ఇప్పుడీ సినిమా ప్రమోషన్లను కూడా వినూత్నంగా చేయాలని నిర్ణయించారు.

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. మహేష్ బాబు పీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తొలిసారి రెండు రోజుల ముందే అమెరికాలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అంటే నవంబర్ 26నే ఈ షోలు చూసే వీలు కలగనుంది.

ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సోమవారం (నవంబర్ 3) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి యూఎస్ఏ ఎలక్ట్రిక...