Hyderabad, ఆగస్టు 27 -- తమిళ కామెడీ మూవీ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. లవ్ మ్యారేజ్ అనే ఓ సినిమా వచ్చే శుక్రవారం (ఆగస్టు 29) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో లీడ్ రోల్‌లో విక్రమ్ ప్రభు నటించాడు. జూన్‌లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్‌కి వస్తోంది. ప్రైమ్ వీడియో ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది.

లవ్ మ్యారేజ్ ఈ ఏడాది జూన్ లో వచ్చిన ఒక తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఇందులో విక్రమ్ ప్రభు, సుష్మిత భట్ ఇంకా మరికొందరు నటులు నటించారు. సినిమా థియేటర్లలోకి వచ్చి రెండు నెలల అవుతోంది. ఇప్పుడు ఆగస్టు 29న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా విశ్వక్ సేన్ నటించిన తెలుగు సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకి రీమేక్. ఈ సినిమా కథ ఇప్పటికే పెళ్ళి వయసు దాటిపోయిన ఒక యువక...