భారతదేశం, ఆగస్టు 24 -- రజనీకాంత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' చిత్రం ఆదివారం రూ.250 కోట్ల నెట్ కలెక్షన్ల మైలురాయిని దాటింది. సూపర్ స్టార్ రజనీకాంత్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 14న విడుదలైంది ఈ చిత్రం. అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీ ఇప్పుడు 11 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం.

బాక్సాఫీస్ దగ్గర కూలీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ ఆదివారం (ఆగస్టు 24) సాయంత్రం 5 గంటల వరకు రూ.6.27 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో కూలీ 11 రోజుల మొత్తం వసూళ్లు రూ.252.27 కోట్లకు చేరుకున్నాయి. సాయంత్రం, రాత్రి ప్రదర్శనల సంఖ్యలు వెల్లడైన తర్వాత మొత్తం వసూళ్లు ఎంతన్నది తేలుతాయి.

కూలీ సినిమా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. రజనీకాంత్ మ...