భారతదేశం, సెప్టెంబర్ 16 -- మార్కెట్​లోకి మరో ఫ్యామిలీ ఎస్​యూవీ ఆప్షన్​ అందుబాటులోకి వచ్చిది! రూ. 10.50లక్షల ఎక్స్​షోరూం ధరతో మారుతీ సుజుకీ విక్టోరిస్​ లాంచ్​ అయ్యింది. ఈ విక్టోరిస్​లో పెట్రోల్​, హైబ్రీడ్​, సీఎన్జీ ఆప్షన్స్​ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీకి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

మారుతీ సుజుకీ విక్టోరిస్​లో ఎల్​ఎక్స్​ఐ, వీఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ(ఓ), జెడ్​ఎక్స్​ఐ ప్లస్​, జెడ్​ఎక్స్​ఐ ప్లస్​(ఓ) వంటి వేరియంట్లు ఉన్నాయి. ఇవి పెట్రోల్ వేరియంట్లు. ఎల్​ఎక్స్​ఐ, వీఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐలో సీఎన్జీ, వీఎక్స్​ఐ నుంచి జెడ్​ఎక్స్​ఐ ప్లస్​(ఓ) వరకు స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ఆప్షన్​ కూడా అందుబాటులో ఉన్నాయి.

పెట్రోల్​ వేరియంట్ల ధరలు రూ. 10.50లక్షల నుంచి రూ. 17.77లక్షల వరకు ఉన్నాయి. 4 వీల్​ డ్రైవ్​ ఆప్షన్​ రూ. 18.64 నుంచి రూ. 19.22లక్ష...