భారతదేశం, అక్టోబర్ 11 -- శాంసంగ్ తన కొత్త తరం గెలాక్సీ ఎం సిరీస్ స్మార్ట్​ఫోన్​ని తాజాగా ఇండియాలో లాంచ్​ చేసింది. దాని పేరు శాంసంగ్ గెలాక్సీ ఎం17. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. దీని ధర రూ. 15,000 లోపే ఉండటం విశేషం. మంచి ఫీచర్లు కోరుకుంటూ, సరసమైన ధరలో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ సరైన ఎంపిక కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్, అద్భుతమైన ఏఐ సామర్థ్యాలు, సుదీర్ఘ కాలం పాటు ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్​) అప్‌గ్రేడ్‌లతో వస్తోంది. ఇవి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకునే అవకాశం ఉంది. దీనికి ముందు మోడల్.. స్టాక్ అయిపోయిన కొద్ది రోజులకే శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ మార్కెట్‌లోకి రావడం, కొత్త తరం మోడల్‌ను సొంతం చేసుకోవడానికి వినియోగదారులకు ఇది సరైన సమయంగా మారింది!

శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ రెండు రంగుల ...