భారతదేశం, సెప్టెంబర్ 28 -- స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇన్ స్టాగ్రామ్ పోస్టు వైరల్ గా మారింది. ఇవాళ (సెప్టెంబర్ 28) ఆమె తన ఇన్ స్టా అకౌంట్లో ఓ లెంగ్తీ పోస్టు పెట్టింది. 20, 30ల్లో తన జీవితం, రియల్ లైఫ్, ఇప్పుడు ఉంటున్న తీరు గురించి వివరించింది. ఈ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత ఇప్పుడ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఆదివారం ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఓ వీడియోతో పాటు పెద్ద పోస్టును కూడా పెట్టింది. ''నిన్న అవ్ని రంభియా (మేకప్ ఆర్టిస్ట్), నేను చాలా మాట్లాడుకున్నాం. అది నన్ను ఆలోచింపజేసింది. ముప్పైల తర్వాత అంతా డౌన్ మాత్రమే అని ప్రపంచం చెప్తుంది. మీ మెరుపు మసకబారుతుంది, మీ అందం జారిపోతుంది. మీరు పరిపూర్ణ ముఖం, పరిపూర్ణ శరీరం, పరిపూర్ణ జీవితం కావాలని సమ...