Hyderabad, జూలై 11 -- మొగలి రేకులు సీరియల్‌లో హీరోగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు ఆర్కే సాగర్. ఇప్పుడు తెలుగు సినిమాల్లోకి చాలా గ్యాప్ తర్వాత పోలీస్‌గా ఆర్కే సాగర్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ది 100. ఇవాళ (జులై 11) థియేటర్లలో ది 100 మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పాల్గొన్న విలేకరుల సమావేశంలో హీరో ఆర్కే సాగర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

ఈ కథ ఎలా పుట్టింది?

-ఇది ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆలోచన. సినిమాగా తీసుకోవచ్చా అని అడిగాను. పేరు పెట్టకుండా తీసుకోవచ్చు అని చెప్పారు. దాదాపు ఆలోచనని నాలుగు సంవత్సరాలు పాటు నా బుర్రలో మోసాను.

-ఒకసారి సుకుమార్ గారి దగ్గరికి లంచ్‌కి వెళ్లాను. కథల గురించి డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఈ కథ చెప్పాను. ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. ముందు ఇలాంటి కథ చేయాలని చెప్పారు. వాళ్ల టీంతో కొన్ని రోజులు జర్నీ జరిగిం...