Hyderabad, జూలై 7 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి చిక్కుల్లో పడ్డారు. తాజాగా మహేశ్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం లీగల్ నోటీసులు జారీ చేసింది. పలు మీడియా సైట్ల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ ఫిర్యాదుతో మహేశ్ బాబుకు రంగారెడ్డి కన్జ్యూమర్ ఫోరం నోటీసులు పంపించిటన్లు సమాచారం.

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌ సంస్థలు రియల్ ఎస్టేట్ నిర్వహించగా అందులో కుంభకోణం జరిగినట్లు హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతినిధిగా, యజమాని కంచర్ల సతీష్‌ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా పేర్కొన్నారు.

అలాగే, సాయి సూర్య డెవలపర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేశ్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషనల్‌లో ఫిర్యాదు దాఖలు అయింది. కేసు వేసిన డాక్టర్, మరో వ్యక్తి ఇద్దరు రెండో ప్రతివ...