భారతదేశం, సెప్టెంబర్ 2 -- వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంక్రమణ, వాటి పొజిషన్ మారినప్పుడల్లా ద్వాదశ రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయి. ప్రస్తుతం నవగ్రహాల్లో శక్తివంతమైన అంగారకుడు (కుజుడు) మిథున రాశిలో సంచరిస్తుండగా, మాయా గ్రహమైన రాహువు శనిదేవుడి స్వక్షేత్రమైన కుంభ రాశిలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో జ్యోతిష్య గణనాల ప్రకారం రాహువు, అంగారకులు ఒకరికొకరు సరిగ్గా 180 డిగ్రీల కోణంలో ముఖాముఖి ఎదురెదురుగా నిలిచారు.

ఈ అరుదైన గ్రహాల వీక్షణం వల్ల శక్తివంతమైన యోగం ఏర్పడింది. ఈ సంచార ప్రభావం సెప్టెంబర్ 18 వరకు కొనసాగనుంది. ఈ కాలంలో ప్రధానంగా 4 రాశుల జాతకులకు విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ధైర్యం, శౌర్యం, ఆకస్మిక ఆర్థిక పురోగతిని అందించే ఈ రాహు-అంగారక సంచార ఫలాలు ఏ రాశికి ఎలా ఉన్నాయో వివరంగా ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశికి అధిపతి స్వ...