భారతదేశం, సెప్టెంబర్ 23 -- జ్యోతిష్య శాస్త్రంలో ఐశ్వర్యం, ప్రేమ, సౌందర్యానికి కారకుడైన శుక్ర గ్రహ సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో విపరీతమైన కీర్తి ప్రతిష్టలు, అపారమైన ధనలాభం కలుగుతాయి. కేవలం రాశి మార్పు మాత్రమే కాకుండా.. శుక్రుడి నక్షత్ర సంచారం కూడా ద్వాదశ రాశుల జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

ప్రస్తుతం శుక్ర గ్రహం రాహువుకి చెందిన స్వాతి నక్షత్రంలో ప్రయాణిస్తోంది. వైదిక పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 11వ తేదీ నుంచి స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించిన శుక్రుడు, అక్టోబర్ 23 అర్ధరాత్రి వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతారు. ఈ కాలంలో శుక్రుడి శుభ దృష్టి వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టం తలపు తడుతోంది. ఇవాళ్టి నుంచి రాబోయే 30 రోజుల పాటు ఈ రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోనుందని ప్రముఖ జ...