Hyderabad, జూన్ 13 -- గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాయి. రాహువు నీడ గ్రహం, కఠినమైన మాటలకు కారకుడు. రాహువు దాదాపు 18 నెలల పాటు ఒకే రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. మే నెలలో రాహువు సంచారం యాదృచ్ఛికంగా జరిగింది. రాహువు మే 18న కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో ఉంటూనే ఇతర గ్రహాలతో సంయోగం చెందుతున్నాడు.

రాహువు, చంద్రుల కలయిక త్వరలో జరగనుంది. జ్యోతిష్యుల నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చంద్రుడు జూన్ 16న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఇప్పటికే కుంభ రాశిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో రాహువు-చంద్రుల సంయోగం జరుగుతుంది. దీంతో ఒక యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది.

కుంభరాశిలో రాహువు-చంద్రుడు సంయోగం చెందడంతో గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని...