భారతదేశం, జూన్ 20 -- రాహువు పేరు వినగానే చాలామంది వెన్నులో వణుకు పుడుతుంది. జాతక చక్రంలో రాహువు స్థానం సరిగ్గా లేకపోతే ఇక జీవితం ఆగమైపోయినట్లేనని, సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటామని జనాలు తీవ్ర భయాందోళనలకు లోనవుతుంటారు. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అపోహలన్నీ అర్థరహితం. రాహువు ప్రభావం మనిషి ఆలోచనా విధానం, అపరిమితమైన కోరికలు, మహత్తర ఆశయాలు మరియు జీవితంలో ఎదురయ్యే ఊహించని మార్పులపై ఉంటుంది. రాహువును కేవలం ఒక దుష్ట గ్రహంగా చూడటం పొరపాటు. అసలు రాహువు గురించి మన సమాజంలో నెలకొన్న అపోహలు ఏంటి? వాస్తవం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది రాహువు ఎక్కడ ఉంటే అక్కడ అశుభమే జరుగుతుందని నమ్ముతారు. ఇది పూర్తి అవాస్తవం. జ్యోతిష్యం ప్రకారం, రాహువు అకస్మాత్తుగా విజయాన్ని ప్రసాదించే గ్రహం. మీ జాతకంలో రాహువు గనుక బలమైన స్థితిలో ఉంటే, మీరు ఊహించని రంగాల్లో ర...