భారతదేశం, నవంబర్ 5 -- మిలాన్‌ (ఇటలీ) వేదికగా జరుగుతున్న ఈఐసీఎంఏ 2025 ట్రేడ్ షోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తన సరికొత్త బుల్లెట్ 650 మోడల్‌ను ఆవిష్కరించింది. ఎన్నో ఏళ్లుగా ప్రఖ్యాతి గాంచిన బుల్లెట్ పేరుకు ప్యారలల్-ట్విన్ పవర్‌ను పరిచయం చేస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌ను తీసుకువచ్చింది. 1932లో తొలిసారిగా విడుదలైనప్పటి నుంచి నేటికీ చెక్కుచెదరని, కాలాతీతమైన డిజైన్‌ను ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వారసత్వంగా కొనసాగిస్తుంది!

బుల్లెట్ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయం. తనదైన ప్రత్యేక డిజైన్ డీఎన్​ఏని కోల్పోకుండా, బుల్లెట్ 650 పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ ఫార్మాట్​లో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

బుల్లెట్‌కు ఉండే అన్ని ప్రత్యేక డిజైన్ అంశాలనూ ఈ కొత్త రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ కలిగి ఉంది. దీని ముందు భాగంలో గుండ్రటి ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్, టైగర్ ఐ ఆకారంలో ఉండ...