భారతదేశం, సెప్టెంబర్ 10 -- వాహనాలపై విధించిన జీఎస్టీ రేటును కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తగ్గించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆ ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ తగ్గింపు బైక్‌లతో పాటు సర్వీసులు, యాక్సెసరీలు, దుస్తుల (అప్పెరల్) మీద కూడా వర్తిస్తుంది! దీనితో ముఖ్యంగా 350సీసీ కేటగిరీలోని బైక్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా బైక్ ప్రియులకు మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయి!

మధ్యస్థాయి మోటార్‌సైకిల్ మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు 350సీసీ సిరీస్ ఎంతో కీలకం. ధరల తగ్గింపు నిర్ణయంతో ఈ మోడళ్లపై బైక్ ప్రియులకు ఆసక్తి మరింత పెరుగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలను తగ్గిస్తున్నట్టు సంస్థ ప్రకటించడం మరింత సానుకూల విషయం.

రాయల్​ ఎన్​ఫీల్డ్​కి చెందిన 350సీసీ బైక్స్​పై గరిష్ఠం...