Hyderabad, సెప్టెంబర్ 19 -- ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, డబ్బుకి లోటు ఉండదు. సంపద పెరుగుతుంది. తులసి మొక్క ముందు రోజు దీపారాధన చేయడం వలన సిరిసంపదలు కలిగి సంతోషంగా ఉండవచ్చు. ఆ ఇంట సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది.

మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఉందా? తులసి మొక్క ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తులసిలో రకాలు ఉన్నాయి. అయితే రామ తులసి, శ్యామ తులసి రెండింట్లో ఏ మొక్క ఇంట్లో ఉంటే మంచిది అని దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుపచ్చ రంగులో ఉండే తులసి మొక్కను రామ తులసి అని అంటారు. దీనిని శ్రీ తులసి, అదృష్ట తులసి, ఉజ్వల్ తులసి అని అంటారు. ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన సంతోషానికి, సంపదకి లోటు ఉండదు. ఈ మొక్క ఉన్న ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉంటుంది.

శ్యామ తులసి లేదా కృష్ణ తులసి కాస...