భారతదేశం, ఆగస్టు 10 -- రామ్ చరణ్, ఉపాసన.. వీళ్లది లవ్ లీ పెయిర్. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఇది. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సినిమాల్లో ఎన్నో టెస్టులు దాటి హీరోగా నిలిచే రామ్ చరణ్.. రియల్ లైఫ్ లోనూ ఓ లవ్ టెస్టులో నెగ్గాడు. ఆ లవ్ టెస్టు పెట్టింది ఎవరో కాదు ఉపాసనే. వీళ్లు డేటింగ్ లో ఉన్న రోజుల్లో రామ్ చరణ్ కు పెట్టిన లవ్ టెస్టు గురించి ఉపాసన తాజాగా వెల్లడించింది.

తాజాగా కర్లీ టేల్స్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన లవ్ టెస్టులో ఎలా పాస్ అయ్యాడో ఉపాసన వెల్లడించింది. ''ఆ సమయంలో మేము డేటింగ్ చేస్తున్నాం. నేను ఓల్డ్ సిటీకి దగ్గరగా ఉండేదాన్ని. నేను అతనితో 'నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నన్ను ఫేమస్ ఐస్ క్రీం షాప్ కి తీసుకెళ్ళాలి' అని అడిగా. ఆ సమయంలో ఫేమస్ ఐస్ క్రీం మార్కెట్ మధ్యలో ఉండేది. అప్పటికే అతను స్టార్. అందరూ అతన్ని గుర్తుపడతారు. అతను సర...