భారతదేశం, నవంబర్ 15 -- మహేష్ బాబు అభిమానులకు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్ర చేస్తున్నారని వెల్లడించారు. అలాగే రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాన్నే సినిమాగా తీస్తున్నామని కూడా రివీల్ చేశారు.

''మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా ప్రారంభించినప్పుడు రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని అనుకోలేదు. ఒక్కో సీన్ రాస్తుంటే గాల్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ డే మహేష్ ను రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫొటోషూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ ఫోటోను వాల్ పేపర్ గా కూడా పెట్టుకున్నా. కానీ ఎవరైనా చూస్తారేమో అని తీసేశా'' అని రాజమౌళి చెప్పారు.

''నన్ను, మహేష్ ను కలిపినందుకు కేఎల్ నారాయణకు థ్యాంక్స్. కొన్ని సినిమాలకు ముందే కథ చెప్పడం కుదురుతుంది. కొన్నింటికి కుదరదు. ఇలాంటి సినిమా కథను మాటల్ల...