Hyderabad, ఆగస్టు 19 -- రాధా అష్టమి 2025: ప్రతి సంవత్సరం, భాద్రపద మాసం శుక్లపక్షంలో ఎనిమిదో రోజున రాధా రాణి జయంతిని జరుపుకుంటారు. రాధా రాణి జన్మదినాన్ని రాధాష్టమిగా జరుపుకుంటారు. హిందూ మతంలో రాధాష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున, రాధా-కృష్ణ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. శ్రీకృష్ణ జన్మాష్టమికి జరిపినట్టే రాధాష్టమి నాడు ఆలయాల్లో ఘనంగా జరుపుకుంటారు.

ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, రాధాష్టమి రోజున రాధా రాణిని పూజించడం వల్ల రాధా రాణి అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. తన భక్తుల అన్ని కోరికలను రాధ నెరవేరుస్తుంది అని నమ్మకం.

ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. రాధారాణి లేకుండా శ్రీకృష్ణుని ఆరాధన అ...