భారతదేశం, ఆగస్టు 19 -- బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దారున పరాజయం చవిచూసింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సల్మాన్, రష్మిక మందన్న జోడీగా వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఈ మూవీ సందర్భంగా సల్మాన్ షూటింగ్ టైమ్ తదితర విషయాలపై డైరెక్టర్ మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వలైపేచు వాయిస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ తో కలిసి పనిచేసేటప్పుడు తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడాడు.

సల్మాన్ ఖాన్ తో పనిచేయడం అంత ఈజీ కాదని ఏఆర్ మురుగదాస్ అన్నాడు. తన డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ కారణంగా సల్మాన్ తో పనిచేయడం అంత సులువు కాదని వెల్లడించాడు. ''ఒక స్టార్ తో షూట్ చేయడం అంత ఈజీ కాదు. రాత్రి 8 గంటలకే సెట్ కు వస్తారు కాబట్టి పగటి పూట సీన్లు కూడా రాత్రిపూట షూట్ చేయాల్సి వచ్చేది. తెల్లవారుజాము న...