భారతదేశం, డిసెంబర్ 25 -- రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించారు. బీ ప్లస్ జీ ప్లస్ 3 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం జరగనుంది.

ఈ సందర్భంగా ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ మాట్లాడారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం 7 భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నామని వివరించారు.

"నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ఇచ్చిన డిజైన్ తో ఈరోజు హై కోర్టు పనులు ప్రారంభించాం. మొత్తం 21 లక్షల చ. అ విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్ తో హైకోర్టు నిర్మాణం జరుగుతుంది. 2,4,6 వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయి. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుంది" అని పురపాలకశాఖ...