భారతదేశం, జనవరి 25 -- అమరావతి రాజధాని పరిధిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. పచ్చదనం, విశాల ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ అహ్మద్, అతిధిలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, గౌరవ హైకోర్టు న్యాయాధిపతులు, రాజధానికి భూములిచ్చిన రైతులు హాజరుకానున్నారు.

శనివారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ ను ఘనంగా నిర్వహించారు. పరేడ్ రిహార్సల్ కు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావు హాజరై పరేడ్ ను పరిశీలించారు.

జంగారెడ్డి గూడెం ఏఎస్పీ పరేడ్ కమాండర్ ఆర్. సుస్మిత నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ పతకా...