భారతదేశం, సెప్టెంబర్ 14 -- కొన్నిసార్లు కొన్ని అద్భుతమైన లవ్ స్టోరీలు ఊహించని సంఘటనతో స్టార్ట్ అవుతాయి. తెలుగు హీరోయిన్ శ్రియా శరణ్ లవ్ స్టోరీ కూడా సినిమా ట్విస్ట్ కు ఏ మాత్రం తగ్గనిది. రాంగ్ ఫ్లైట్ తో ఆమె తన భర్త ఆండ్రీ కోస్చీవ్ ను కలిసింది. అసలు ఏం జరిగింది? శ్రియా శరణ్ లవ్ స్టోరీ ఏంటో? ఓ సారి చూసేయండి.

శ్రియా శరణ్‌ తన భర్త అండ్రీ కోస్చీవ్‌ను అనుకోకుండా కలిసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో తాజా ఎపిసోడ్‌లో మాల్దీవులకు ఒంటరి ప్రయాణంలో బుకింగ్ లోపం వల్ల తన జీవితంలో ప్రేమను ఎలా కలిసిందో నటి హృదయపూర్వకంగా, వినోదాత్మకంగా వివరించింది. మాల్దీవుల్లో తన భర్తను కలవడం గురించి శ్రియా చెప్పుకొచ్చింది.

"నేను తప్పు నెలలో తప్పు ఫ్లైట్ బుక్ చేసుకున్నా. మాల్దీవుల దక్షిణాన ఒక క్రూజ్‌లో ఒంటరిగా ముగించా. అక్కడే నేను అండ్రీని కలిశ...