భారతదేశం, అక్టోబర్ 4 -- ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న. ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఈ నెలలో మరో మూవీ రాబోతోంది. ఇప్పుడు ఇంకో సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. రష్మిక మందన్న లీడ్ రోల్ ప్లే చేసిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు.

రష్మిక మందన్న లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన 'ది గ‌ర్ల్‌ఫ్రెండ్' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 7న థియేటర్లలోకి రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

''మీ టైప్ ఎవరు? నవంబర్ 7, 2025 నుంచి థియేటర్లలో ది గర్ల్ ఫ్రెండ్ తో ఈ చర్చ కొనసాగించండి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో'' అని ఎక్స్ లో గీతా ఆర్ట్స్ పోస్ట...