భారతదేశం, నవంబర్ 27 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ థామా (Thamma). బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.170 కోట్ల వరకూ వసూలు చేసింది. అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి 40 రోజుల తర్వాత ఓటీటీలోకి రానున్నట్లు బజ్ నెలకొంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకోండి.

రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా నటించిన మూవీ థామా. మ్యాడక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మరో సినిమా ఇది. అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ కాగా.. డిసెంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇది ఫ్రీగా కాకుండా రెంట్ విధానంలో రానుంది. దీనికోసం ఏకంగా రూ.400 చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఇక డిసెంబర్ 16 నుంచి ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లందరికీ ఫ్రీగా అందుబాటులోకి వస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ...