భారతదేశం, ఆగస్టు 26 -- మాస్ మహారాజ్ రవితేజ అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర'. మేకర్స్ ముందుగా ప్రకటించిన దాని ప్రకారం రేపు (ఆగస్టు 27) ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ రిలీజ్ కు ముందు ఉండాల్సిన ఎలాంటి హడావుడి కనిపించలేదు. దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడదే నిజమైంది. ఫ్యాన్స్ కు షాకిస్తూ రవితేజ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు.

ముందు షెడ్యూల్ ప్రకారం వినాయక చవితి సందర్భంగా బుధవారం (ఆగస్టు 27)న మాస్ జాతర సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ కూడా చేశారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా రవితేజ మూవీ హడావుడి కనిపించలేదు. చివరకు ఇవాళ (ఆగస్టు 26) రిలీజ్ కు ఒక రోజు ముందు మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

రవితేజ అప్ కమింగ్ మూవీ మాస్ జాతర రిలీజ్ వాయిదా వేయడం వెనుక ఉన్న కారణ...